ప్రముఖ మలయాళ నటుడు, ‘మహానటి’ ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్’. ‘సార్’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ స్టార్ డైరెక్టర్ గురించి ఇలా చెప్పారు.. “ఈరోజు నా బ్రదర్ దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రావడం హ్యాపీగా ఉంది. ‘పెళ్లిచూపులు’ సినిమా హిట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ చెక్ వచ్చింది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచే. ఆ రోజు త్రివిక్రమ్ గారు నన్ను ఆఫీస్‌కి పిలిపించి, కూర్చోబెట్టి నాతో మాట్లాడి ఫస్ట్ చెక్ ఇప్పించారు. ఆరోజు త్రివిక్రమ్ గారిని కలవడం నా లైఫ్‌లో ఒక బిగ్ మూమెంట్.”
“మన జనరేషన్‌కి తెలుసు. త్రివిక్రమ్ గారు పనిచేసిన మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, జల్సా సినిమాలు ఎంత పెద్ద హిట్టో. అయితే నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన సినిమాలు అతడు, ఖలేజా. అలాంటి సినిమాలు చేసిన ఆయన మనల్ని ఆఫీస్‌కి పిలిపించి కూర్చోబెట్టి.. త్వరలోనే నువ్వు స్టార్ అవుతావురా చెక్ తీసుకో అంటే.. అప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను.”
“ఇప్పటికి ఏడేళ్లు అవుతుంది అనుకుంటా. చాలారోజులు పట్టింది సినిమా చేయడం. విజయ్ దేవరకొండ12’ నేను, గౌతమ్ సితారలో చేయాలని రాసిపెట్టుందేమో. త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం. త్రివిక్రమ్ గారు సినిమాల గురించే కాదు, జీవితం గురించి, రామాయణ, మహాభారతాల గురించి చెప్తుంటే అలా వింటూ కూర్చోవచ్చు. ఆయన నా అభిమాన దర్శకుల్లో ఒకరు.” అని అన్నారు విజయ్ దేవరకొండ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























