దుల్కర్ సల్మాన్ ,వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా లక్కీ భాస్కర్.ఈ దీపావళికి విడుదలవుతుంది.కొద్దీ రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.దాంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ఇక సినిమా మీద వున్న నమ్మకంతో విడుదలకు ఒక రోజు ముందుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు.దాదాపు 100 ప్రీమియర్ షో లు వేయనున్నారు. 30వతేది సాయంత్రం 6గంటలకు ఈ షోస్ స్టార్ట్ కానున్నాయి. ఇందులో గనక హిట్ టాక్ వస్తే సినిమాకు అడ్వాంటేజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తొలి సినిమా సీతారామంతో సాలిడ్ హిట్ కొట్టి ఇక్కడ కూడా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్.ఇక ఇప్పుడు లక్కీ భాస్కర్ తో వస్తున్నాడు.అటు సార్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు దర్శకుడు వెంకీ అట్లూరి.మరి లక్కీ భాస్కర్ తో వీరిద్దరూ వరుసగా రెండో విజయాన్ని అందుకుంటారో చూడాలి.ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.నాగవంశీ ,సాయి సౌజన్య ఈసినిమాను నిర్మించారు.
అయితే దీపావళికి ఈసినిమాతోపాటు మరో కొన్ని సినిమాలు కూడా వస్తున్నాయి.అందులో క ,అమరన్ ,బఘీర సినిమాలు వున్నాయి.వీటికి కూడా మంచి బజ్ వుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద లక్కీ భాస్కర్ కు పోటీ ఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























