SDT 18 సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

SENSATIONAL MUSICIAN ajaneesh loknath on board for SDT18

సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ 18వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.రీసెంట్ గా ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తయింది.త్వరలోనే మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఈ షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో సెట్ వేయనున్నారు.ఈ షెడ్యూల్ తో సగానికిపైగా షూటింగ్ పూర్తికానుంది.1947-67లో జరిగే కథతో తెరకెక్కుతున్న ఈసినిమాలో తేజ్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.కొద్దీ రోజుల క్రితం మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు.సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా ఫిక్స్ చేశారు.కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించనున్నాడు.ఇంతకుముందు తేజ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ విరూపాక్షకు కూడా అజనీషే సంగీతం అందించాడు. ఈసినిమా విజయంలో తన బీజీఎమ్ కీ రోల్ ప్లే చేసింది.ఇక ఇప్పుడు SDT 18వ సినిమాకు కూడా తననే తీసుకున్నారు.

కొత్త దర్శకుడు రోహిత్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది.ఇందులో ఐశ్వర్యా,వసంత అనే పాత్రలో కనిపించనుంది.ఇక కంటెంట్ మీద వున్న నమ్మకంతో ఖర్చు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి,చైతన్య రెడ్డి.దాదాపు 100కోట్ల బడ్జెట్ పెడుతున్నారు.ఈసినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది.వచ్చే ఏడాది వేసవి లో ప్రేక్షకులముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.