ప్రిన్స్ శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిజ జీవితం ఆధారంగా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. అమరన్ మేజర్ ముకుంద్ చేసిన త్యాగాలకు గొప్ప ట్రిబ్యూట్‌గా వుంటుందని ఈ ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది. ఈ క్రమంలో జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. అమరన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ, డేట్ ఫిక్స్ అయింది. రేపు అనగా, శనివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ వేదికగా జరపనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.
కాగా ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ఉలగనాయగన్ కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తెలుగులో ఈ సినిమాను టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితారెడ్డి తమ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ విడుదలచేయనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























