సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. ‘సార్’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫ్యామిలీని కాపాడుకోవడానికి అలాగే గౌరవంగా బ్రతకడానికి ఓ సామాన్య బ్యాంకు ఉద్యోగి జీవితంలో ఉన్నత స్థాయికి ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.
దీంతో చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా వుంది. ఇక ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో లక్కీ భాస్కర్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ తేది, వేదిక ఖరారు అయింది. అక్టోబర్ 27న హైదరాబాద్ లోని జేఆర్‌సీ కన్వెన్షన్ వేదికగా ఈ వేడుక జరుగనుంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ వేదికగా వెల్లడించారు.
అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనే ఎదురుకానుంది. దీపావళికి ఈ సినిమాతో పాటు కిరణ్ అబ్బవరం క, శివ కార్తికేయన్-సాయి పల్లవి జంటగా నటించిన అమరన్.. అలాగే భారీ అంచనాలున్న కన్నడ డబ్బింగ్ సినిమా బఘీర విడుదలవుతున్నాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ ఫైట్ మొదలవ్వనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: