బాలకృష్ణ గారు రియల్లీ అన్‌స్టాపబుల్ – సూర్య

Nandamuri Balakrishna is Really Unstoppable Person, Says Hero Suriya

నందమూరి బాలకృష్ణ గారు రియల్లీ అన్‌స్టాపబుల్ పర్సన్ అని పేర్కొన్నారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఈ మేరకు ఆయన హీరోగా నటించిన ‘కంగువ’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. చిత్ర యూనిట్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో హీరో సూర్య కంగువ విశేషాలు వివరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో బాలకృష్ణ గురించి ఎదురైన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. “బాలకృష్ణ గారు రియల్లీ అన్‌స్టాపబుల్ పర్సన్. ఇప్పుడే అన్‌స్టాపబుల్ షోలో పాల్గొని వచ్చాను. ఆయన ఎనర్జీ లెవెల్స్ సూపర్బ్. వేకువఝామున 3:30కి నిద్రలేస్తారని విన్నాను. అప్పటినుంచి మళ్ళీ పడుకునేవరకు అంతే ఎనర్జీగా ఉండటం ఆయనకే సాధ్యం.” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఒకవైపు సినిమా షూటింగ్స్, ఇంకోవైపు బసవతారకం హాస్పిటల్ పనులు, ఎమ్మెల్యేగా నియోజకవర్గ సమస్యలు, మళ్ళీ అన్‌స్టాపబుల్ షోకి హోస్ట్‌గా.. ఇన్ని బాధ్యతలు నిర్వర్తించడం అంటే మాటలు కాదు. అది కూడా ఈ వయస్సులో.. అందుకే బాలకృష్ణ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘జై బాలయ్య’ అంతే” అని చెప్పారు హీరో సూర్య.

కాగా శివ దర్శకత్వం వహిస్తున్న కంగువ హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్‌గా నటించగా.. బాబీడియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. రాక్‌ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 భాషల్లో 3డీ వర్షెన్‌ సహా విడుదల కానుంది.

ఇక ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతుండగా.. ఓవర్సీస్‌ రైట్స్‌ను ‘ఫార్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ సంస్థ దక్కించుకుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.