దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఈ మేరకు ఆయన హీరోగా నటించిన ‘కంగువ’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సహా హాజరైన సూర్య కంగువ విశేషాలు వివరించారు. ఈ క్రమంలో రాజమౌళి గురించి ఎదురైన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ.. “రాజమౌళి గారంటే మా అందరికీ చాలా చాలా గౌరవం. ఒక ప్రాంతీయ చిత్రాన్ని గ్లోబల్ రేంజ్‌కి తీసుకువెళ్లడం అనేది ఊహకు కూడా అందనిది. అయితే అలాంటి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చూపించిన నిజమైన ఫిల్మ్ మేకర్ రాజమౌళి. మా అందరికీ ఆయన ఒక మార్గం చూపించారు. ఇప్పుడు ఆ దారిలోనే మేమంతా నడుస్తున్నాం. అందుకు ఆయనకు థాంక్స్” అని తెలిపారు.
ఇక కంగువ చిత్ర దర్శకుడు శివ కూడా దర్శకధీరుడిని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రతి డైరెక్టర్‌కి రాజమౌళి గారు గాడ్ ఫాదర్ వంటివారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ఒక పయనీర్. గ్రాఫిక్స్ ఎలా వాడుకోవాలి? కథలో ఎమోషన్ ఎలా చెప్పాలి? అనేవి ఆయన నుంచి అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు. రాజమౌళి వేసిన దారిలోనే మేమూ నడుస్తున్నాం” అని చెప్పారు.
కాగా శివ దర్శకత్వం వహిస్తున్న కంగువ హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్గా నటించగా.. బాబీడియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 భాషల్లో 3డీ వర్షెన్ సహా విడుదల కానుంది.
ఇక ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతుండగా.. ఓవర్సీస్ రైట్స్‌ను ‘ఫార్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ సంస్థ దక్కించుకుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























