రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన పుష్ప 2

1000 crore pre release business for Pushpa 2 the rule

ఈఏడాది చివర్లో రానున్న మచ్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్.ఒక్క తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు.దాంతో పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్.ఇక బిజినెస్ పరంగా పుష్ప 2 సరికొత్త రికార్డు సృష్టించింది.థియేట్రికల్,నాన్ థియేట్రికల్ కలుపుకొని మొత్తం 1000కోట్లకు పైగా బిజినెస్ చేసింది.థియేట్రికల్ రూపంలోనే 600కోట్లకు పైగా బిజినెస్ జరిగిందట .ఆలెక్కన బ్రేక్ ఈవెన్ కావాలంటే 1000కోట్లకు పైగా రాబట్టాల్సివుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమాకు వున్న హైప్ కు బ్లాక్ బాస్టర్ టాక్ తోడైతే ఆ టార్గెట్ కష్టమేమి కాకపోవచ్చు.తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు అన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది.విడుదలయ్యాక నాన్ ఎస్ ఎస్ ఆర్ రికార్డులు లేచిపోవడం ఖాయం.మొదటి రోజు 300కోట్లను టచ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.అదే జరిగితే ఈ ఫీట్ సాధించే మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించనుంది.మరి విడుదలకు ముందే సెన్సేషన్ సృష్టిస్తున్న పుష్ప 2 రిలీజ్ తరువాత ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇక ఈసినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఈనెల చివరికల్లా షూటింగ్ పూర్తి కానుంది.ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ రెడీ అయ్యింది.నవంబర్ మొదటి వారం లో ఫస్ట్ కాపీ రెడీ కానుంది.డిసెంబర్ 6న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈసినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.