ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో పుష్ప 2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇందుకు తగ్గట్టే ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ చిత్రం బ్యాలెన్స్ షూటింగ్‌ను జరుపుకుంటూనే మరోవైపు నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఎడిట్ కాపీని లాక్ చేశారు మేకర్స్. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ దీనికి ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఇక ఇదిలావుంటే, తాజాగా పుష్ప 2 నుంచి మేకర్స్ అభిమానులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే.. పుష్ప 2 నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
సినిమా విడుదలకు ఇంకో 50 రోజులే ఉన్న నేపథ్యంలో గురువారం సోషల్ మీడియాలో ఈ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీనిని గమనిస్తే.. పుష్ప రాజ్ మెడలో పులిగోరు, గోల్డ్ చైన్స్, చేతులకు రింగ్స్, బ్రేస్ లెట్స్, కడియలతో కుర్చీలో ఠీవిగా కూర్చుని సీరియస్‌గా చూస్తున్న లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తోంది. కాగా ప్రస్తుతం ఈ 50 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక పుష్ప 2 చిత్రం డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా షూటింగ్ పార్ట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టనుంది చిత్ర బృందం. దీంతో సెకండ్ హాఫ్‍లోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం మొత్తం మూడు యూనిట్లు పనిచేస్తున్నాయని తెలుస్తోంది. ఇందులో ఒక యూనిట్ రంపచోడవరంలో పని చేస్తుండగా.. మరో రెండు యూనిట్స్ వైజాగ్, యానాంలో ఎడతెరిపిలేని షూట్‌లో పాల్గొంటున్నాయి.
కాగా ‘పుష్ప 2’ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, రావు రమేష్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా చేస్తుండగా.. టాలీవుడ్ సీనియర్ నటులు జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరియు డైరెక్టర్ హోం బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: