టాలీవుడ్ ప్రేమ జంట అక్కినేని నాగచైతన్యు-శోభిత ధూళిపాళ్ళ త్వరలో వివాహ బంధం లోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరి నిశ్చితార్ధం జరుగగా.. ఈ వేడుకలో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో చైతూ-శోభితా ఉంగరాలు మార్చుకున్నారు. మరికొన్ని రోజుల్లోనే వీరి వివాహం జరుగనున్న నేపథ్యంలో తాజాగా శోభిత తమ పెళ్లి పనులను సంప్రదాయబద్దంగా మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగా పెళ్ళికి ముందు జరిగే తొలి సాంఘ్యం గోధుమ రాయిని, అనగా.. పూర్వపు పద్ధతులు, ఆచారాల ప్రకారం, రోకలితో పసుపు దంచడం ఘనంగా నిర్వహించారు. మెరిసిపోయే పట్టుచీరలో తన కుటుంబసభ్యులతో కలిసి ఆమె దీనిలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి శోభిత ఇన్ స్టాగ్రామ్ వేదికగా వేడుక ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ మూవీలో నటిస్తున్నాడు. సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. గీతా ఆర్ట్స్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న తండేల్ త్వరలో గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























