పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్‌కు వరల్డ్ వైడ్‌గా అభిమానులున్నారు. ‘బాహుబలి’ సిరీస్ సినిమాల తర్వాత ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. తన ఛరిష్మాతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. జపాన్ దేశంలోనూ ఆయనకు మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అక్కడ ప్రభాస్‌ను ఇష్టపడే అభిమానుల సంఖ్య మరీ ఎక్కువ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే, ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముందుగానే ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు జపాన్ లోని టోక్యో రెబెల్ స్టార్ ఫ్యాన్స్. వివరాల్లోకి వెళ్తే.. రాధే శ్యామ్ సినిమా ప్రత్యేక ప్రదర్శన చూసిన అనంతరం హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అంటూ బ్యానర్స్ చూపిస్తూ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభాస్‌కు టోక్యో ఫ్యాన్స్ చేసిన బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు మన దగ్గర కూడా ప్రభాస్ పుట్టినరోజు సందడి ఆల్రెడీ మొదలైంది. ఒకవైపు ఆయన సూపర్ హిట్ సినిమాల రీ రిలీజ్లు, మరోవైపు కొత్త సినిమాల అప్డేట్స్ సిద్ధమవుతున్నాయి. అభిమానులు ఈ స్పెషల్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి సంతోషంగా సన్నద్ధమవుతున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























