విక్రమార్కుడు తర్వాత నాకు ఆ లోటు తీర్చింది

Actor Ajay Says, After Vikramarkudu I Played Strong Role in Pottel

చార్ట్‌బస్టర్ సాంగ్స్, గ్రిప్పింగ్ టీజర్ ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో ‘పొట్టేల్’ మూవీ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అజయ్ ముఖ్య పాత్రలో కనిపిస్తుండగా.. ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా శుక్రవారం స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ చేతులమీదుగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ట్రైలర్ మరింత అంచనాలను పెంచింది.

ఈ సందర్భంగా ఇందులో పటేల్ అనే క్రూరమైన పాత్ర పోషించిన యాక్టర్ అజయ్ మాట్లాడుతూ.. “అందరికీ గుడ్ ఈవెనింగ్. విక్రమార్కుడు తర్వాత నాకు గట్టి విలన్ రోల్ పడలేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఆ లోటు ఈ సినిమా తీరుస్తుంది. ఈ సినిమాలో పార్ట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎండ్ అఫ్ మై కెరియర్ ఈ సినిమాని నేను చేశానని లైబ్రరీలో పెట్టుకుని మా పిల్లలకు చూపిస్తాను. ఈ సినిమా నేను చూశాను. అద్భుతంగా ఉండబోతుందని నాకు తెలుసు. మీరు కూడా అలాగే రియాక్ట్ అవుతారని నమ్ముతున్నాను. థాంక్యూ” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.