మెకానిక్ రాకీ ట్రైలర్ అప్డేట్

Mechanic Rocky Trailer Launch tomorrow

ఈ ఏడాది ఆల్రెడీ రెండు సినిమాలతో వచ్చాడు యంగ్ హీరో విశ్వక్ సేన్.అందులో గామి హిట్ అవ్వగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓపెనింగ్స్ పరంగా అదరగొట్టి ఆతర్వాత నిరాశపరిచింది.ఇక వచ్చే నెలలో మెకానిక్ రాకీతో రావడానికి రెడీ అవుతున్నాడు విశ్వక్.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తుంది.ఇప్పటివరకు ఈసినిమా నుండి వచ్చిన రెండు పాటలు,టీజర్ ప్రామిసింగ్ గా అనిపించాయి.ఇక రేపు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.మూసాపేట లోని శ్రీరాములు థియేటర్ లో రేపు సాయంత్రం 4:06 గంటలకు ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు.బజ్ పెరగడంలో ఈట్రైలర్ కీ రోల్ పోషించనుంది.విడుదలకు కొద్దీ రోజుల ముందు మరో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రవితేజ ముళ్ళపూడి ఈసినిమాను తెరకెక్కిస్తుండగా మీనాక్షి చౌదరీ ,శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.జేక్స్ బేజాయ్ సంగీతం అందిస్తున్నాడు.ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు.నవంబర్ 22న మెకానిక్ రాకీ థియేటర్లలోకి రానుంది.మరి ఈఏడాది మూడో రిలీజ్ తో వస్తున్న విశ్వక్ కు ఈసినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్, లైలా అనే సినిమా కూడా చేస్తున్నాడు.ఇందులో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనుండగా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తుండగా తనిష్క్ బాఘ్చి సంగీతం అందిస్తున్నాడు.షైన్ స్క్రీన్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదలకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.