నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. చాలా ఏళ్ల వారి ఎదురుచూపులకు తెరదించుతూ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ నేడు వచ్చేసింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. ‘అఖండ 2’ కోసం వారు చేతులు కలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా దాదాపు మూడేళ్ళ క్రితం కరోనా భయానక పరిస్థితుల తర్వాత ప్రేక్షకులు అసలు థియేటర్లకు వస్తారా? అని అందరూ అనుకుంటున్న సమయాన 2021లో వచ్చిన ‘అఖండ’ వారందరి అంచనాలను తల్లకిందులు చేసేసింది. బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
నాడు థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు బద్దలయ్యాయంటే.. ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాతో బాలయ్య కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పీక్స్ కి వెళ్లిపోయింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలను నందమూరి అభిమానులు అనేకసార్లు బోయపాటిని కోరారు. ఆయన కూడా తప్పకుండా చేస్తానని, కథ సిద్ధం చేస్తున్నానని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కోరిక నెరవేర్చేలా తాజాగా అధికారిక ప్రకటన వచ్చేసింది. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సింహ, లెజెండ్ మరియు అఖండ చిత్రాల తర్వాత ‘అఖండ 2 తాండవం’ తో మరోసారి వీరు కలిసి పనిచేయబోతున్నారు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ సందర్భంగా మేకర్స్ అఖండ 2 టైటిల్ పోస్టర్‌ని విడుదల చేశారు.
ఈ టైటిల్ పోస్టర్.. అనేక ఆధ్యాత్మిక అంశాలతో డిజైన్ చేయడం గమనించొచ్చు. టైటిల్ రుద్రాక్ష కట్టబడి, స్ఫటిక లింగంతో దైవికత ఉట్టిపడేలా ఉంది. దీనికి క్యాప్షన్‌గా ‘తాండవం’ అని పెట్టడం మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ తాండవానికి రెండు డమరుకాలు ఉన్నాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో హిమాలయ పర్వతాలు ఠీవిగా నిలబడిఉన్నాయి. బాలయ్య ఈ ‘అఖండ 2’తో తాండవం ఆడేయడం గ్యారెంటీ అని అద్భుతంగా డిజైన్ చేసిన ఈ టైటిల్ పోస్టర్ తెలియజేస్తోంది. మరోవైపు టైటిల్ థీమ్ తెలియజేస్తూ ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
కాగా ఈ చిత్రానికి బాలయ్య చిన్న కుమార్తె ఎమ్. తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తుండటం విశేషం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతుండగా.. బాలకృష్ణ, బోయపాటి ఇద్దరికీ ఇది తొలి పాన్ ఇండియా మూవీ కావడం గమనార్హం. దీంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా ఉంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























