ఓజీ షూటింగ్ పునఃప్రారంభం

Power Star Pawan Kalyan's OG Shooting Resumes

కొన్ని నెలలుగా ఊపిరి సలపని రాజకీయ వ్యవహారాలతో ఉంటూ వస్తోన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొంత సమయం సినిమాలకు కేటాయిస్తున్నారు. దీనిలో భాగంగా గతంలో తాను హీరోగా నటిస్తోన్న పలు సినిమాలు వివిధ దశల్లో ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆయా చిత్రాల షూటింగులకు హాజరవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఆయన హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హరవీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలన్నింటిపై ఇటు పవర్ స్టార్ అభిమానులతో పాటు అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఓజీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ పునఃప్రారంభం అయింది. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ కొన్ని కీలక సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. అయితే పవర్ స్టార్ తన పోర్షన్‌కి సంబంధించిన కీలక సన్నివేశాలను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేలా చూడమని మేకర్స్‌కి సూచించినట్టు సమాచారం.

ఇందుకు తగ్గట్టుగానే వారు షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వీలైనంత వేగంగా పూర్తిచేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నారు. కాగా ఓజీ మూవీ యూకే పంపిణీ హక్కులను ఓ ప్రముఖ సంస్థ దక్కించుకుంది. డ్రీమ్‌జెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఓజీని యూకేలో రిలీజ్ చేయనుంది. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత దానయ్య తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఇక త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకానుంది. తమిళ స్టార్ హీరో శింబు ఈ సాంగ్ ను పాడుతుండటం విశేషం. దీనికి సంబంధించి ఇటీవలే చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి. అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో హిస్టారిక్ మూవీ హరిహర వీరమల్లు నుంచి కూడా ఫస్ట్ సింగిల్ త్వరలోనే రానుంది. దీనిని పవనే స్వయంగా పాడటం మరో విశేషం.

కాగా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘ఓజీ’ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్‌ రాజ్‌, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే కిక్‌ శ్యామ్‌, వెంకట్‌ బచ్చు, అజయ్‌ ఘోష్‌, మొట్ట రాజేందర్‌, జీవా, హరీష్‌ ఉత్తమన్‌, శాన్‌ కక్కర్‌, అభిమన్యు సింగ్‌, కుమనన్‌ సేతురామన్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.