నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు అరుదైన గౌరవం లభించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సైబర్ దోస్త్ విభాగం మంగళవారం కీలక ప్రకటన చేసింది. కాగా సైబర్ దోస్త్ విభాగం దీనిపై ఎక్స్ వేదికగా ఇలా తెలిపింది..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా పాన్-ఇండియా స్టార్ రష్మికను ఆన్‌బోర్డ్ చేయడానికి సంతోషిస్తున్నాము. మేము భారతదేశం యొక్క డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను పటిష్టం చేయడానికి దళాలలో చేరుతున్నాము, మేము సైబర్ నేరాలను ధీటుగా ఎదుర్కొంటాము. ఎల్లప్పుడూ గుర్తుంచుకో” అని అందులో పేర్కొంది.
ఇక దీనిపై హర్షం వ్యక్తం చేసిన నటి రష్మిక సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. గతంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి ఇందులో వివరించారు. ఈ ఘటన తర్వాత సైబర్ క్రైమ్‌కు వ్యతిరేకంగా గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అలాగే దేశంలోని పలువురు మహిళలకు దీనిపై అవగాహన కల్పించేందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా తనవంతుగా సాయపడతానని చెప్పారు.
ఇక రష్మిక మందన్నా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప 2’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. డిసెంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితోపాటు మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’, సల్మాన్ ఖాన్-ఏఆర్ మురుగదాస్ కాంబో మూవీ మరియు శేఖర్ కమ్ముల కుబేరలో ధనుష్, నాగార్జునలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది రష్మిక.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























