‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. ఆ తర్వాత ‘సీతారామం’ చిత్రంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ అందుకున్నాడు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ`మూవీలో గెస్ట్ రోల్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశాడు. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ తెలుగులో హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. ఇక అక్టోబర్ 21న లక్కీ భాస్కర్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కానుండగా.. అక్టోబర్ 26 లేదా 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు మేకర్స్. అలాగే అక్టోబర్ 30 నుంచి లక్కీ భాస్కర్ ప్రీమియర్ షోలు వేయనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ ‘శ్రీమతి గారు’ విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ‘శ్రీమతి గారు’ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ పాటకు గీత రచయిత శ్రీమణి సాహిత్యం అందించగా.. విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్ గాత్రం అందించారు. జివి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు.
కాగా 1980-90 లలో ఉన్నత స్థాయికి చేరుకున్న ఓ సాధారణ బ్యాంక్ క్యాషియర్ కథాంశంగా రూపొందుతోంది. దీంతో నిర్మాతలు 80ల నాటి ముంబై నగరాన్ని హైదరాబాద్‌లో భారీ సెట్‌లతో నిర్మించారు. అలాగే ఆ కాలం నాటి బ్యాంకులను పోలి ఉండే ఒక భారీ బ్యాంక్ సెట్‌ను కూడా రూపొందించినట్టు సమాచారం. ప్రముఖ ఛాయగ్రాహకుడు నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందించారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు సహా తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























