యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 31న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు. ఈ రోజు ”క” సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం క, లక్కీ భాస్కర్ సినిమాలు ఒకేరోజు విడుదల కానుండటంపై స్పందించారు. దీనిపై కిరణ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “క సినిమాను ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్ణయించాం. ఆ రోజు చాలా సినిమాలు రిలీజ్‌కు వస్తున్నాయి. థియేటర్స్ దగ్గర పోటీ ఉంది. మేము ఈ నెల 31న రిలీజ్ చేయడానికి కారణం మా వంశీ నందిపాటి. ఆయన మూవీ చూసి మంచి ప్రైస్ ఇచ్చి సినిమా రిలీజ్ చేస్తున్నారు.”
“మా అందరికీ “క” సినిమాపై సినిమాపై నమ్మకం ఉంది. ఈ రోజు ఆడియెన్స్ చాలా ఎంపికగా థియేటర్స్ కు వెళ్తున్నారు. కంటెంట్ నచ్చితేనే టికెట్ బుక్ చేసుకుంటున్నారు. మా మూవీ టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏదో కొత్త కంటెంట్ మూవీలో ఉండబోతోంది అనే వైబ్ క్రియేట్ అయ్యింది. కంటెంట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి “క” సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం.”
“తమిళంలో సహా అన్ని భాషల్లో ఈ నెల 31నే రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నాం. తమిళనాట స్థానిక సినిమాలు ఎక్కువగా ఉన్నందున థియేటర్స్ అందుబాటులో లేవు. అయినా తమిళ్ రిలీజ్ కు ప్రయత్నిస్తున్నాం. “క” సినిమా 70వ దశకం నేపథ్యంతో పీరియాడిక్ కథతో సాగుతుంది. కాబట్టి యూత్ తో పాటు కుటుంబ ప్రేక్షకులు, మీ ఇంట్లోని పెద్ద వాళ్లను కూడా ఆకర్షించే అంశాలుంటాయి.”
“దుల్కర్ సల్మాన్ గారు మా మూవీని చూసి మలయాళ రిలీజ్‌కు తీసుకున్నారు. ఆయన లక్కీ భాస్కర్ సినిమా కూడా ఈ నెల 31న వస్తుందని అనుకోలేదు. ముందు వారి సినిమా డేట్ ఇది కాదు. మా మూవీ కూడా డేట్ అనౌన్స్ చేయలేదు. క, లక్కీ భాస్కర్ ఒకే రోజు రిలీజ్ ఊహించలేదు. ఇలా ఈ రెండు సినిమాలు ఒకే డేట్‌కు రావడం అనేది అనుకోకుండా జరిగిన విషయం. పండగ సీజన్ కాబట్టి అన్ని సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా” అని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: