వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా దసరా కానుకగా ‘జనక అయితే గనక’ అక్టోబర్ 12న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది. జనక అయితే నుంచి ఫస్ట్ సింగిల్ ‘నా ఫేవరెట్ నా పెళ్ళాం’, సెకండ్ సింగిల్ ‘నువ్వే నాకు లోకం’, థర్డ్ సింగిల్ ‘ఏం పాపం చేశామో’ పాటలను రిలీజ్ చేయగా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా చిత్రయూనిట్ బందరులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.
ఇక ఇటీవలే ఈ మూవీ నుంచి చిత్ర యూనిట్ స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేసింది. ఇదే క్రమంలో తాజాగా జనక అయితే గనక రిలీజ్ ట్రైలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, గోపరాజు, రఘుబాబు, పృథ్వీ, శివన్నారాయణ, రూపలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
జనక అయితే గనక సినిమాకు సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రొడక్షన్ డిజైనర్‌గా అరసవిల్లి రామ్‌కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా భరత్ గాంధీ పనిచేస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి గ్రాండ్‌గా నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























