‘విరూపాక్ష’ సినిమాతో సంచలన విజయం అందుకున్న ట్యాలెంటెడ్ హీరోయిన్ సంయుక్తా మీనన్.. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో చేసిన ‘సార్’ మూవీతో సూపర్ సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు. టాలీవుడ్లో లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఆమె తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించింది. బుధవారం ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఈరోజు పూజ కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి మరియు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతులమీదుగా ఈ కొత్త చిత్రం లాంఛ్ చేయబడింది. ఇక ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ అంతా పాల్గొంది. కాగా లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో ఈ సినిమా రూపొందుతుండటం విశేషం.
ఫిల్మ్ మేకర్స్ వెంకీ కుడుముల, కోన వెంకట్ ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందజేశారు. రానా దగ్గుబాటి క్లాప్‌కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. దర్శకులు వశిష్ట, రామ్ అబ్బరాజు తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, జెమినీ కిరణ్, సాహు గారపాటి, చుక్కపల్లి అవినాష్, తదితరులు పాల్గొన్నారు.
హాస్య మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.6గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి యోగేష్ కెఎంసి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మరికొన్నిరోజుల్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుండగా.. త్వరలోనే ఇందులో నటించనున్న నటీనటులు మరియు ఇతర సాంకేతిక సిబ్బంది వివరాలను వెల్లడించనున్నారు మేకర్స్. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాలను అందించిన సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























