మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో చిత్రంపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో హీరోయిన్ కావ్య థాపర్ తన అనుభవాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా కావ్య థాపర్ మాట్లాడుతూ.. “విశ్వం నాకు చాలా స్పెషల్ మూవీ. శ్రీను వైట్ల గారి హీరోయిన్ అనే ట్యాగ్ నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఆయన సపోర్ట్‌కి చాలా థాంక్యూ. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. యాక్టర్ గా మెరుగయ్యాను. గోపి సార్‌తో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆయనతో డాన్స్ చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. వేణు గారు సపోర్ట్‌కి థాంక్యూ. విశ్వంకు ఆయన మెయిన్ పిల్లర్. ఫారెన్ షెడ్యూల్స్ అన్ని ఆయన సపోర్ట్ తోనే చాలా సాఫీగా జరిగాయి” అని తెలిపారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “కెమెరామెన్ గుహన్ గారు ఐ ఫీస్ట్ లాంటి విజువల్స్ ఇచ్చారు. సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి ఎలివేట్ చేసిన నిర్మాత విశ్వ ప్రసాద్ గారికి థాంక్యూ. ఆయన లేకపోతే ఈ సినిమా పాజిబుల్ అయ్యేది కాదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హోం ఫర్ మీ. టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. విశ్వం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆడియన్స్‌కి నవరాత్రి ట్రీట్ లాంటి సినిమా. తప్పకుండా అక్టోబర్ 11న సినిమా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























