రా మచ్చ మచ్చకు సెన్సేషనల్ రెస్పాన్స్

Raa Macha Macha song from Game Changer gets excellent response

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుండి రీసెంట్ గా సెకండ్ సింగిల్ రా మచ్చ మచ్చ రిలీజైనా విషయం తెలిసిందే.ఇక ఈసాంగ్ కు సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.తెలుగులో 24గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన సెకండ్ లిరికల్ సాంగ్ గా రికార్డు సృష్టించిన ఈ సాంగ్ ఇప్పుడు కేవలం 5రోజుల్లో అన్ని భాషల్లో కలిపి 50 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది.అనంత్ శ్రీరామ్ లిరిక్స్ ,తమన్ బీట్స్,నకాష్ అజీజ్ వోకల్స్ తో వచ్చిన ఈసాంగ్ రిపీట్ వాల్యూ సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సాంగ్ తో సినిమాకు వున్న బజ్ కూడా పెరిగిపోయింది.తెలుగు తోపాటు హిందీ , తమిళం లో విడుదలకాగా ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ట్రెండింగ్ లో వుంది.ఈ సాంగ్ లో రామ్ చరణ్ వేసిన స్టెప్స్ ను రీ క్రియేట్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు.మొత్తానికి ఫస్ట్ సింగిల్ జరగండి కంటే సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకొని తరువాత వచ్చే సాంగ్స్ పై అంచనాలు పెంచేసింది సెకండ్ సింగిల్.

ఇక మరో రెండు పాటలు ఎప్పుడు రానున్నాయో తమన్ అప్డేట్ ఇచ్చాడు వచ్చే నెలలో థర్డ్ సాంగ్ విడుదలకానుందని ఇది మెలోడీ సాంగ్ అని అలాగే ఫోర్త్ సాంగ్ నవంబర్ లో రిలీజ్ కానుందని ఈ రెండు కూడా అదరగొడతాయని తమన్ ట్వీట్ చేశాడు.శంకర్ మార్క్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ ,అంజలి,ఎస్ జె సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమాను క్రిస్మస్ కు బరిలోకి దింపాలని చూస్తున్నారు.భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈసినిమా విజయం సాధించడం శంకర్ కి తప్పనిసరి కానుంది.అటు ఆచార్యతో నిరాశపరిచిన రామ్ చరణ్,ఈ గేమ్ ఛేంజర్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుందని కాన్ఫిడెంట్ గా వున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.