టాలీవుడ్ స్టార్ జంట నాగచైతన్య-సమంత విడాకులకు సంబంధించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంత్రి సురేఖ మాట్లాడిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మహిళామంత్రి కామెంట్లను అక్కినేని ఫ్యామిలీ తీవ్రంగా ఖండించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఇటు నాగార్జున కుటుంబంతో పాటు నటి సమంతకు మద్దతుగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరో వెంకటేష్, స్టార్ హీరోలు మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, ‘మా’ అధ్యక్షుడు, నటుడు విష్ణు మంచు, నాగబాబు, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి జంట, యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సందీప్ కిషన్, శ్రీవిష్ణు, డైరెక్టర్, డైరెక్టర్స్ రామ్ గోపాల్ వర్మ, శ్రీకాంత్ ఓదెల, రచయిత అబ్బూరి రవి, తదితరులు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే తన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో దీనిపై కొండా సురేఖ స్పందించారు. అక్కినేని, సమంత కుటుంబాలను బాధించడం తన ఉద్దేశం కాదని తెలిపారు. ఈ మేరకు సమంత ఎక్స్ పోస్ట్‌కు ఆమె ఇలా బదులిచ్చారు.. “నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా” అని అందులో పేర్కొన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























