మిథున్‌ చక్రవర్తికి ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’

Mithun Chakraborty to be Honoured with Dadasaheb Phalke Award

భారతదేశంలో సినీ రంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ ఒకటి. ఈ అవార్డును పొందడం అనేది నటీనటులకు లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ వంటిది. ఇప్పటికే అక్కినేని నాగేశ్వరరావు, అమితాబ్ బచ్చన్ వంటి పలువురు ప్రముఖులు ఈ పురస్కారాన్ని పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ అవార్డు బాలీవుడ్ సీనియర్ హీరో, లెజండరీ నటుడు మిథున్ చక్రవర్తిని వరించింది. ఆయన ఈ అవార్డుకు ఎంపికైనట్లుగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్‌ 8న జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

కాగా మిథున్ చక్రవర్తి 1950వ సంవత్సరంలో కోల్‌కతాలో జన్మించారు. 1976లో నటుడిగా ‘మృగాయ’ అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. అయితే తొలి చిత్రంతోనే ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకోవడం విశేషం. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.

‘ఐ యామే డిస్కో డాన్సర్‌’ అంటూ యావత్ దేశాన్ని తన డాన్స్‌తో అలరించిన మిథున్ చక్రవర్తి.. ‘బన్సారీ’, ‘అమర్‌దీప్‌’, ‘సాహాస్‌’, ‘వాంటెడ్‌’, ‘బాక్సర్‌’, ‘త్రినేత్ర’, ‘దుష్మన్‌’, ‘దలాల్‌’, ‘భీష్మ’, ‘సుల్తాన్‌’, ‘గురు’, ‘కిక్‌’, ‘బాస్‌’, డిస్కోడాన్సర్‌ వంటి ఎన్నో చిత్రాల ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు.

తన సుదీర్ఘ కెరీర్ లో మిథున్ చక్రవర్తి హిందీతో పాటు బెంగాలీ, కన్నడ, ఒరియా, భోజ్‌పురి చిత్రాల్లో నటించారు. అలాగే తెలుగులోనూ ఆయన విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ‘గోపాల గోపాల’ సినిమాలో స్వామిజీగా ‘థ్యాంక్యూ’ అంటూ తన విలక్షణ నటనతో మెప్పించారు. ఆ తర్వాత ‘మలుపు’ అనే చిత్రంలోనూ ఆయన తెలుగు ప్రేక్షకులను పలకరించారు.

ఇక ఈ ఏడాది ఆరంభంలో కేంద్ర ప్రభుత్వం మిథున్‌కు పద్మభూషణ్‌ అవార్డును అందజేసింది. ఇప్పుడు ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారానికి ఎంపికచేసింది. తద్వారా ఆయన అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఇక ఈ వార్త తెలిసిన సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా మిథున్‌ చక్రవర్తికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.