దేవర నిన్న పాన్ ఇండియా మూవీ గా విడుదలకాగా తెలుగు తరువాత హిందీ లో సాలిడ్ వసూళ్లను దక్కించుకుంటుంది.నార్త్ లో కూడా టాక్ ,రివ్యూస్ పాజిటివ్ గా రావడం తో మొదటి రోజు 7.90కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ఈ రేంజ్ వసూళ్లు అంటే బాగానే వచ్చినట్లు.ఇక ఈరోజు మొదటి రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది.ఫుల్ రన్ లో అక్కడ ఎంత రాబట్టుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ నార్త్ లో పరిచమయ్యాడు.అది దేవర కు మంచి ప్లస్ అయ్యింది.దాంతో ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి.ఈ కలెక్షన్స్ తో హిందీ లో మొదటి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన సౌత్ సినిమాల జాబితాలో సలార్ తరువాత దేవర నిలిచింది.ఇందులో కెజియఫ్ 53.95కోట్ల తో మొదటి స్థానంలో ఉండగా 41 కోట్లతో బాహుబలి2 రెండో స్థానంలో వుంది.
కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన దేవర లో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటించగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ,సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించారు.తెలుగులో వీరిద్దరికి ఇదే మొదటి సినిమా.అనిరుధ్ సంగీతం అందించాడు.ఎన్టీఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్ నిర్మించాయి.ఇక దేవర పార్ట్ 2 కూడా రానుంది.అయితే ఇప్పుడప్పుడే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా లేదు. ఎన్టీఆర్ కు వున్న కమిట్ మెంట్స్ అయిపోయాక దేవర2 ను మొదలు పెట్టనున్నారు.ఆలెక్కన మరో రెండేళ్ల తరువాతే దేవర 2 మొదలయ్యే ఛాన్స్ ఉంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























