తమిళ హీరో శివ కార్తికేయన్,సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా అమరన్.ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తుంది. మేజర్ ముకుంద్ గా శివ కార్తికేయన్ అలాగే తన సతీమణి సింధు పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది.ఇక ఈరోజు ఈసినిమా నుండి సాయి పల్లవి పాత్రను పరిచయం చేశారు.ఈ సందర్బంగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో సాయి పల్లవి ఇందు రెబకా వర్గీస్ గా కనిపించనుంది.ఓవరాల్ గా ఈ క్యారెక్టర్ ఇంట్రో గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమా పై అంచనాలు పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచనుంది అమరన్ టీం.అందులో భాగంగా త్వరలోనే మరో అప్డేట్ రానుంది.సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.అమరన్ తెలుగులోకూడా విడుదలకానుంది.తెలుగు థియేట్రికల్ రైట్స్ ను శ్రేష్ట్ మూవీస్ దక్కించుకుంది.అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది.
ఇక శివ కార్తికేయన్ ప్రస్తుతం మురగదాస్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.ఇందులో కాంతారా ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.వచ్చే ఏడాది ఈసినిమా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























