అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కల్కి

Kalki 2898 AD to be Screened at Busan International Film Festival on October 8th and 9th

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్‌ అశ్వనీదత్‌ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్‍గా రిలీజైన సంగతి గుర్తుండేవుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. ఈ క్రమంలో దేశ, విదేశాల్లో పలు రికార్డులను బద్దలు కొట్టిన కల్కి ఆగస్ట్ 22న ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ సహా అన్ని దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

తాజాగా కల్కి సినిమాకు ఓ అరుదైన అవకాశం వచ్చింది. ఒక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడటానికి సిద్ధమైంది. ఈ మేరకు ప్రతిష్టాత్మకమైన బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కల్కి 2898 AD చిత్రం ప్రదర్శించనున్నారు. దక్షిణ కొరియాలోని ప్రముఖ బుసాన్ నగరంలో జరిగే ఈ వేడుకలో అక్టోబర్ 8, 9 తేదీల్లో కల్కి చిత్రం స్క్రీనింగ్ జరుగనుంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

కాగా కల్కి చిత్రంలో ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు కనిపించగా.. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలుగా నటించారు. అలాగే మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ఈ చిత్రానికి కొనసాగింపుగా కల్కి 2ను తెరకెక్కించడానికి దర్శకుడు నాగ్ అశ్విన్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్‌ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.