యూఎస్ఏ బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న మత్తువదలరా 2

Mathu Vadalara 2 USA Box Office Collection Day 4

ట్యాలెంటెడ్ హీరో శ్రీ సింహా కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో నటించగా, రితేష్ రానా దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా 2’. గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా తెరకెక్కింది. దీంతో ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ప్రమోషనల్‌ సాంగ్‌.. ఇలా ప్రతి ప్రమోషన్‌ మెటీరియల్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో  మత్తు వదలరా 2 సెప్టెంబర్ 13న ప్రేక్షకులముందుకు వచ్చింది. ముందురోజు స్పెషల్ ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ అంచనాలకు మించి హిట్ అయింది. హీరో శ్రీ సింహా సైడ్ కిక్‌గా సత్య చేసిన కామెడీకి మంచి అప్లాజ్ వస్తోంది. హీరోతో సమానంగా స్క్రీన్ స్పేస్ దక్కించుకున్న సత్య విశ్వరూపం చూపించాడని ఆడియెన్స్ చెబుతున్నారు.

మూవీ ఆద్యంతం హిలేరియస్‌గా ఉందని మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో అన్ని థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను చూసి మూవీ చాలా బాగుందని చెప్పడం మరింత అడ్వాంటేజ్ అయ్యింది. ఈ క్రమంలో మత్తు వదలరా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం అదరగొడుతోంది.

ఇప్పటికే అక్కడ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని బ్లాక్ బాస్టర్ దిశగా సాగుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. యూఎస్ఏ బాక్సాఫీస్‌ వద్ద మొత్తం 700k మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇదే జోరు కొనసాగితే ఈ వీకెండ్ లోపు 1 మిలియన్ క్లబ్ లో చేరడం పక్కాగా కనిపిస్తోంది. ‘దేవర’ థియేటర్లలోకి రావడానికి ఇంకో 10 రోజులు సమయం ఉన్న నేపథ్యంలో మత్తు వదలరా 2 ఈజీగా ఈ మార్క్ అందుకుంటుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

కాగా మత్తువదలరా 2లో ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఫిమేల్ లీడ్ రోల్‌లో కనిపించగా.. సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. హీరో శ్రీసింహా సోదరుడు కాల భైరవ సంగీతం సమకూర్చగా.. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ నిర్వహించారు.

ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక పార్ట్ 2 కూడా హిట్ కావడంతో మత్తువదలరా 3 రావొచ్చు అని మూవీ లవర్స్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి మూవీ క్లైమాక్స్‌లో సత్యతో ఓ హింట్ కూడా ఇచ్చారని వారు గుర్తుచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.