ఇప్పుడంతా అనిరుధ్ హవానే -ఎన్టీఆర్

ntr praises anirudh work for Devara

ఇప్పుడు ఎక్కడ చూసినా దేవర గురించే చర్చ.వచ్చే వారంలోనే థియేటర్లలోకి రానుంది.కల్కి 2898 ఏడి తరువాత తెలుగులో వస్తున్న పెద్ద సినిమా కావడం అలాగే 6ఏళ్ళ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా రానుండడంతో ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో బిజీగా వుంది.అందులో భాగంగా ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు.రీసెంట్ గా ముంబై లో దేవర టీంను యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూ చేశాడు.ఈవీడియోను నిన్న రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.నార్త్ ఆడియన్స్ ను టార్గెట్ గా ఈవీడియో చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్,సంగీత దర్శకుడు అనిరుధ్ ను ఆకాశానికి ఎత్తేశాడు.దేవర బీజీఎమ్ గురించి చెప్పండి అని అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానమిస్తూ.. దేశం మొత్తం అనిరుధ్ సాంగ్స్ వింటుంది.బ్రిలియంట్ మ్యుజిషియన్.తను సినిమాను అర్ధం చేసుకొనే విధానం అద్భుతం.దేవర కు హాలీవుడ్ మూవీ రేంజ్ మ్యూజిక్ ఇచ్చాడు. ప్రస్తుతం అంతా అనిరుధ్ హవా నడుస్తుందంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

ఇక ఈసినిమా విజయంపై ఎన్టీఆర్ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ లు సినిమాలో థ్రిల్ చేస్తాయని ,చివరి 40నిమిషాలు అయితే నెక్స్ట్ లెవెల్ అని అంటున్నాడు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్,రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడో చూడాలి.రేపు ఈసినిమా ప్రమోషన్ చెన్నైలో జరుగనుంది.ఎన్టీఆర్,కొరటాల శివ ప్రెస్ మీట్ లో పాల్గొనున్నారు.సెప్టెంబర్ 27న దేవర ఫస్ట్ పార్ట్ థియేటర్లలోకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.