విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్‌డేట్ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేయగా.. అవన్నీ మంచి హైప్ క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెప్టెంబర్ 9న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ‘కన్నప్ప’ టీమ్ ఆయనకు స్పెషల్ సర్‌ప్రైజ్ అందించింది. ఆయన పోషించిన శివుని పాత్రకి సంబంధించిన ప్రీ లుక్‌ను రిలీజ్ చేసింది. కాగా కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సోమవారం కన్నప్ప నుంచి విష్ణు మంచు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
తాజాగా మరో పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది కన్నప్ప టీమ్. ఈ చిత్రంలో తిన్నడికి విధేయుడైన స్నేహితుడు.. టిక్కి (గుర్రం)ని పరిచయం చేశారు విష్ణు మంచు. ఈ గుర్రానికి సంబంధించిన పోస్టర్లు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ పోస్టర్‌లో విష్ణు మంచు లుక్ అదిరిపోయేలా ఉంది. ఇక మున్ముందు కన్నప్ప నుంచి ఎలాంటి అప్డేట్లు వస్తాయో.. ఎంతలా బజ్ క్రియేట్ చేస్తాయో చూడాలి.
ఇప్పటికే కన్నప్ప టీజర్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం ఉంది. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు తిన్నడు పాత్రతో వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: