నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్‌టైన్‌మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొన్నిరోజుల క్రితం మేకర్స్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇక ఇటీవలే నేచురల్ స్టార్ నాని ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మా నాన్న సూపర్ హీరో ఫస్ట్ సింగిల్‌కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది. ‘నాన్నా’ అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ సెప్టెంబర్ 19న విడుదల చేయనున్నట్టు తెలిపింది.
కాగా మా నాన్న సూపర్ హీరో చిత్రానికి అనిల్ కుమార్ పి ఎడిటర్, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. మహేశ్వర్ రెడ్డి గోజాల క్రియేటివ్ ప్రొడ్యూసర్. అభిలాష్ రెడ్డి కంకర, MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల రైటర్స్‌గా పని చేస్తున్నారు. టీజర్ ద్వారా అనౌన్స్ చేసిన విధంగా, మా నాన్న సూపర్ హీరో సినిమాను అక్టోబర్ 11 న విడుదల చేయనున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























