గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు.అప్పుడెప్పుడో ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు ఇక ఆతరువాత ఎలాంటి అప్డేట్ రాలేదు.అయితే ఎట్టకేలకు ఇక ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెర పడనుంది.రేపు ఈసినిమా నుండి కీలకమైన అప్డేట్ రానుంది.రిలీజ్ డేట్ తోపాటు సెకండ్ సింగిల్ డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాదాపు రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా ఎట్టకేలకు పూర్తికావొచ్చింది.ఈనెలలో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయనున్నారు.క్రిస్మస్ కు బరిలో దించనున్నారు.శంకర్ డైరెక్షన్ లో సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్నఈసినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ కాగా ఎస్ జె సూర్య, శ్రీకాంత్,శ్యామ్,అంజలి కీలక పాత్రల్లో పోషిస్తున్నారు.తమన్ సంగీతం అందిస్తన్నాడు.భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ నుండి వస్తున్న సినిమాకావడంతో గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు వున్నాయి.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో రూరల్ డ్రామా గా తెరకెక్కనున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ నటించనుండగా కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.అక్టోబర్ లేదా నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఏఆర్ రెహమాన్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ ,మైత్రి మూవీ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























