వెంకటేష్, రానా ఉదారం.. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం

Victory Venkatesh and Rana Daggubati Donates Huge Aid For Telugu States Amid Floods

తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు భారీ వరదలు పోటెత్తడంతో కొన్ని జిల్లాలు జలమయం అయ్యాయి. అనేకచోట్ల లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో లక్షలాదిమంది ప్రజలు గడచిన మూడు రోజులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు అగ్ర హీరోలు సహా ప్రముఖులు వారిని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ కూడా వరద బాధితులకు చేయూత అందించేందుకు ముందుకొచ్చింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు ఒక్కోదానికి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.1 కోటి భారీ విరాళం ప్రకటించింది. ఈ మేరకు వారి హోం బ్యానర్ ‘సురేష్ ప్రొడక్షన్స్’ సోషల్ మీడియాలో దీనిపై అధికారిక ప్రకటన చేసింది.

“తెలుగు రాష్ట్రాలలో సంభవించిన వరదల వలన కలిగిన నష్టం చూసి మేము ఎంతో చలించాం. ఇలాంటి విపత్కర సమయంలో అందరం ఒక్కటిగా ఉండి బాధితులకు ఆసరాగా నిలబడదాం. దీనిలో భాగంగానే విక్టరీ వెంకీ మామ (వెంకటేష్) మరియు రానా దగ్గుబాటి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహాయ మరియు పునరావాస ప్రయత్నాలకు రూ.1 కోటి విరాళంగా అందిస్తున్నారు” అని అందులో పేర్కొంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.