గత ఏడాది విరుపాక్ష,బ్రో తో వచ్చిన సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన 18వ సినిమాలో నటిస్తున్నాడు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కాగా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో సెకండ్ షెడ్యూల్ జరుగుతుంది.దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతుంది.ఇందులో సాయి దుర్గా తేజ్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు.కొత్త దర్శకుడు రోహిత్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో హీరోయిన్ ఎవరనేది రివీల్ చేశారు.ఐశ్వర్య లక్ష్మి ఇందులో కథానాయికగా నటిస్తుంది.ఈరోజు తన బర్త్ డే కావడంతో ఈసినిమా నుండి తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి విషెస్ తెలిపింది చిత్ర బృందం.ఇందులో ఐశ్వర్యా,వసంత అనే పాత్ర పోషిస్తుంది.కంటెంట్ మీద వున్న నమ్మకంతో ఖర్చు వెనుకాడకుండా సినిమాను నిర్మిస్తున్నారు హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి,చైతన్య రెడ్డి.ఈసినిమాలో విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండనుంది.
త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఇది పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది.మరి ఈసినిమా,సాయి దుర్గా తేజ్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: