కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్‌ను కలిసిన హీరో నాని

Natural Star Nani Meets Kannada Superstar Shiva Rajkumar

నేచురల్ స్టార్ నాని కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్‌ (శివన్న)ను కలిశారు. నాని నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా రేపు రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆయన దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మూవీ ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు బెంగళూరులో ప్రత్యేక ఈవెంట్‌ ఏర్పాటు చేయగా.. అందులో శివన్న కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో నాని శాండల్‌వుడ్ సూపర్ స్టార్‌ను కలుసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా నానితో కలిసి శివ రాజ్‌కుమార్‌ సరదాగా కొద్దిసేపు చిట్ చాట్‌ చేశారు. ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలకు సంబంధించిన విషయాలు సహా తమ వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నారు. కాగా శివన్న నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘భైరతి రణగల్’ దీపావళి కానుకగా నవంబర్‌లో విడుదలకానుంది. అయితే ఇద్దరు స్టార్ హీరోలు ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఇరువురి అభిమానులను అలరిస్తోంది.

ఇక నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తోన్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో SJ సూర్య పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.