ఖుషి 2 చేస్తే పవన్ కళ్యాణ్‌తో చేయండి – ప్రియాంక మోహన్

Actress Priyanka Mohan Requests SJ Suryah To Do Khushi 2 With Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా ‘ఖుషి’. 2001లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రానికి ప్రముఖ కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఎస్‌జె సూర్య దర్శకత్వం వహించారు. యూత్ ని విశేషంగా అలరించిన ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనీ పవర్ స్టార్ అభిమానులు చాలాకాలంగా కోరుతున్నారు. తాజాగా ఇదే డిమాండ్ ను వినిపించింది నటి ప్రియాంక అరుల్ మోహన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఆమె కథానాయికగా నటించిన ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్‌లో ఘనంగా జరిగింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించగా.. ఎస్‌జె సూర్య, సాయికుమార్, అజయ్, అదితి బాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.

కాగా ఈ చిత్రం ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రియాంక అరుల్ మోహన్ మాట్లాడుతూ.. “నాకు ఇది స్పెషల్ ఫిలిం. దానయ్యగారు నాకు ఓజి. సినిమాలో కూడా అవకాశం కల్పించారు. నా కెరీర్‌లో ఈ రెండూ చాలా ఇంపార్టెంట్. అందుకు కళ్యాణ్, దానయ్యగారికి థ్యాంక్స్” అని అన్నారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. “వివేక్ గారు మంచి పాత్ర ఇచ్చారు. వివేక్ మాస్ సినిమాలు బాగా తీస్తాడని అనిపిస్తుంది. SJ సూర్యతో తమిళంలో ‘డాన్’ సినిమా చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో నటించాను. ఇందులో చాలా నేర్చుకున్నాను. అలాగే ‘ఖుషి 2’ చేస్తే పవన్ కళ్యాణ్‌తో చేయండి. నాని గారితో రెండవ సినిమా చేశాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాని గారు నిజంగానే ట్రెజర్ హంటర్” అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.