న్యాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం ఈ గురువారం థియేటర్లలోకి రానుంది.ఇప్పటికే నాని ఈసినిమాను ఓరేంజ్ లో ప్రమోట్ చేశాడు.కంటెంట్ ఫై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు నాని.దాంతో ఈసినిమా తనకు హ్యాట్రిక్ విజయాన్ని ఇస్తుందని బలంగా నమ్ముతున్నాడు.ఇక అన్ని చోట్ల ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా మంచి రెస్పాన్స్ వస్తుంది.ముఖ్యంగా యుఎస్ఏలో సరిపోదా శనివారం అదరగొడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నానికి ఓవర్సీస్ లో సాలిడ్ మార్కెట్ వుంది.ఇప్పటివరకు అక్కడ నాని నటించిన 9సినిమాలు మిలియన్ మార్క్ డాలర్ మార్క్ ను క్రాస్ చేశాయి.ఇక ఇప్పుడు సరిపోదా శనివారం కూడా అదే దారిలో పయనిస్తోంది.ఇప్పటివరకు 200k పైగా ప్రీమియర్ సేల్స్ జరిగాయి.సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా 1 మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకోనుంది.అదే జరిగితే నానికి ఇది 10వ మిలియన్ డాలర్ మూవీ కానుంది.టాలీవుడ్ లో అత్యధిక సార్లు మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన హీరోల జాబితాలో ప్రస్తుతం నాని రెండో స్థానంలో వున్నాడు.
వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సరిపోదా శనివారంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఎస్ జె సూర్య విలన్ గా చేశాడు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.డివివి ఎంటర్ టైన్మెంట్స్ పై దానయ్య ఈసినిమాను నిర్మించాడు.ఇక వివేక్- నాని కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.ఇంతకుముందు వీరి కాంబో లో వచ్చిన అంటే సుందరానికీ నిరాశపరిచింది.మరి ఇప్పుడు సరిపోదా శనివారం ఎలాంటి ఫలితాన్నిఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































