చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గా ప్రతినిధి 2 తో వచ్చాడు యంగ్ హీరో నారా రోహిత్.అయితే ఎలక్షన్స్ ముందు వచ్చిన ఈసినిమా నిరాశపరిచింది. నారా రోహిత్ కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా గా నిలిచిన ప్రతినిధికి సీక్వెల్ గా వచ్చింది ఈసినిమా.కానీ ప్రతినిధి మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది.ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు నారా రోహిత్.ప్రస్తుతం ఈహీరో తన 20వ మూవీ సుందరకాండలో నటిస్తున్నాడు.ఈరోజు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈటీజర్ బాగుంది.టీజర్ చూస్తే ఈసారి నారా రోహిత్ ప్రామిసింగ్ కంటెంట్ తో వస్తున్నాడనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోకి మ్యారేజ్ ఏజ్ దాటినా ఐదు లక్షణాలు కలిగి ఉన్న పార్ట్నర్ కోసం సెర్చ్ చేయడం ఇక తన కోసం అమ్మాయిని వెతికి పేరెంట్స్ కూడా విసిగిపోవడం టీజర్ లో ఈ సన్నివేశాలు హిలేరియస్ అనిపించాయి.ఈసినిమాలో వృతి వాఘని హీరోయిన్ గా నటిస్తుండగా ఈశ్వర్ ఫేమ్ శ్రీ దేవి విజయ్ కుమార్ రీ ఎంట్రీ ఇస్తుంది.నరేష్, వాసుకి ఆనంద్,సత్య,అభినవ్ గోమఠం కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కొత్త దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్నఈసినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల,గౌతమ్ రెడ్డి,రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
ఇక ఈ టీజర్ లాంచ్ సందర్భంగా హీరో నారా రోహిత్ మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. వెంకీ నాతో ఐదేళ్ళుగా జర్నీ చేస్తున్నాడు.ఇదొక పెక్యులర్ లవ్ స్టొరీ. కమ్ బ్యాక్ మూవీ గా ఈ స్క్రిప్ట్ నే లాక్ చేశాం.ఈ సినిమా జర్నీ చాలా స్పెషల్. సంతోష్, గౌతమ్,రాకేశ్ సినిమాని బలంగా నమ్మారు.వెంకీ బ్రిలియంట్ కథ రాశారు. ఈ స్టేజ్ మీద వున్న అందరినీ కథే తీసుకొచ్చింది.టీజర్ మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను.లియాన్ జేమ్స్ మంచి ఆల్బం ఇచ్చాడు. మంచి పాటలు కుదిరాయి.మున్ముందు సినిమా నుంచి మరింత కంటెంట్ రాబోతోంది. థాంక్ యూ ఆల్’ అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























