కన్నప్ప.. అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్ రిలీజ్

Kannappa Avram Manchu First Look Released on Eve of Krishna Janmashtami

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక అప్డేట్ ఇస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు. సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగా మంచు విష్ణు తనయుడు అవ్రామ్ భక్త మంచు ఫస్ట్ లుక్ విడుదలయింది. ‘తిన్నడు’ (కన్నప్ప) చిన్నప్పటి పాత్రలో అవ్రామ్ కనిపించనున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా అవ్రామ్ ఈ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. మంచు వారి మూడు తరాలు ఇందులో కనిపించబోతున్నాయి. మోహన్ బాబు, విష్ణు మంచు, అవ్రామ్ మంచు కలయికతో ఈ చిత్రం స్పెషల్ కానుంది. ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారి విగ్రహం ముందు గిరిజన బాలుడిగా అవ్రామ్ లుక్ ఆకట్టుకునేలావుంది.

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో కనిపించనున్న కన్నప్ప అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రాబోతోంది. ఇటీవలే విడుదల చేసిన టీజర్‌కి అద్భుతమైన స్పందన రావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. కాగా మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంయుక్తంగా సంగీతం అందిస్తున్న కన్నప్ప సినిమా డిసెంబర్‌లో పాన్‌ ఇండియా వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది.

కాగా ఇప్పటికే కన్నప్ప తండ్రి ‘నాథనాథుడు’గా శరత్ కుమార్, చెంచుల మహారాణి ‘పన్నగ’గా మధుబాల, ‘ముండ‌డు’ అనే ఎరుక‌ల దొర పాత్ర‌లో సీనియ‌ర్ న‌టుడు దేవ‌రాజ్, భిల్ల జాతి అధినేత ‘చండుడు’ అనే పాత్రలో సంపత్ నటిస్తున్నట్టు మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే స‌దాశివ కొండ‌ల్లో నివ‌సించే పుళిందుల అనే జాతి నాయకుడు ‘కంప‌డు’గా ముఖేష్ రిషి, ‘గ‌వ్వ‌రాజు’గా బ్ర‌హ్మాజీ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ రిలీజై ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.