నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ఈ పాన్ ఇండియా అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌లో ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ సహా ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. అలాగే పలు ప్రాంతాల్లో ఇటీవల చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్‌కు అనూహ్య స్పందన వచ్చింది. మరోవైపు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్ అందించింది. ఇక ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలు అని హీరో నాని స్వయంగా వెల్లడించారు. ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ‘సరిమప’.. ప్రమోషనల్ సాంగ్ కూడా విడుదలైంది. ఈ వేడుకలో అతిథులుగా దర్శకులు దేవా కట్టా, శైలేష్ కొలను, ప్రశాంత్ వర్మ, శ్రీకాంత్, శౌర్యవ్, నిర్మాత సుధాకర్ చెరుకూరి తదితరులు పాల్గొన్నారు. అలాగే కెమెరామెన్ మురళీ, సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ సహా పలువురు చిత్ర యూనిట్ హాజరయ్యారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































