కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. కాగా ఈ చిత్రం నిజ జీవితం ఆధారంగా తెరక్కుతుండటం విశేషం. శివ అరూర్ మరియు రాహుల్ సింగ్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్’ అనే పుస్తకంలోని ‘మేజర్ వరదరాజన్’ చాప్టర్ ను బేస్ చేసుకుని రూపొందించబడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అమరన్‌లో శివకార్తికేయన్ మునుపెన్నడూ చూడని అవతార్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ఉలగనాయగన్ కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్‌లలో విడుదలకానుంది.
ఈ నేపథ్యంలో అమరన్ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ సంస్థ సొంతం చేసుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కుటుంబం సారథ్యంలోని శ్రేష్ట్ మూవీస్ తెలుగు రైట్స్ దక్కించుకుంది. ఈ మేరకు మేకర్స్ నేడు అధికారికంగా ప్రకటించారు. కాగా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితారెడ్డి ఈ సినిమాను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా విడుదల చేయనున్నారు.
కాగా బ్లాక్ బస్టర్ హిట్ ‘విక్రమ్’ తర్వాత కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్‌తో శ్రేష్ట్ మూవీస్‌కి ఇది రెండవ సహకారం. ఇక అమరన్ సినిమాకు అగ్రశ్రేణి సాంకేతిక బృందం సహకారం అందిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తుండగా.. సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. అలాగే ప్రొడక్షన్ డిజైనర్‌గా రాజీవ్, ఎడిటర్‌గా ఆర్. కలైవానన్ పనిచేస్తున్నారు. ఇంకా అన్బరివ్ మాస్టర్‌తో పాటు స్టీఫన్ రిక్టర్ యాక్షన్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































