ఇండియన్ సౌత్ ఫిల్మ్ అవార్డులకు సంబంధించిన ప్రతిష్టాత్మక వేదిక ‘ఐఫా ఉత్సవం’ (IIFA) వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. ఈ యేడాది తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం పరిశ్రమలకు చెందిన అత్యుత్తమ చిత్రాలకు అవార్డు ప్రెజెంటేషన్‌లు అందించనుంది. ఇక వేడుకల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలతో కూడిన గ్రాండ్ గాలా కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశం సిద్ధమవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఈవెంట్‌కి అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో గల ప్రతిష్టాత్మక ఎతిహాద్ ఎరీనా ఇండోర్ స్టేడియం ఆతిథ్యమిస్తుండగా.. సెప్టెంబర్ 27వ (శుక్రవారం) తేదీన గ్రాండ్ గా జరుగనుంది. అందులో భాగంగా తెలుగు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలకు సంబంధించి అవార్డులు ప్రకటించనున్నారు. విజేతలకు ప్రముఖుల చేతులమీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి స్టార్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
ఇక ఈ సంరంభం కోసం దేశవ్యాప్తంగా వివిధ చిత్ర పరిశ్రమల నుండి అగ్ర తారలు, ఫిల్మ్ మేకర్స్ విచ్చేయనున్నారు. కాగా 2024 ఐఫా అవార్డుల కోసం నామినేషన్స్ ఓపెన్ అయ్యాయి. దీనిలో భాగంగా సౌత్ లోని అన్ని భాషల నుంచి ఈ నామినేషన్స్ పూర్తయ్యాయి. టాలీవుడ్ నుంచి కొన్ని చిత్రాలు వివిధ కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
ఐఫా ఉత్సవం అవార్డ్స్ – టాలీవుడ్ నామినేషన్స్
ఉత్తమ చిత్రం కేటగిరీ
- భగవంత్ కేసరి
- సలార్: పార్ట్ 1- సీజ్ ఫైర్
- దసరా
- హాయ్ నాన్నా
- బేబీ
ఉత్తమ దర్శకుడు
- సాయి రాజేష్ నీలం – బేబీ
- అనిల్ రావిపూడి – భగవంత్ కేసరి
- శ్రీకాంత్ ఓదెల – దసరా
- మహేష్ బాబు పి – మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
- ప్రశాంత్ నీల్ – సలార్ పార్ట్1- సీజ్ ఫైర్
ఉత్తమ నటుడు
- నందమూరి బాలకృష్ణ – భగవంత్ కేసరి
- నాని – దసరా
- నాని – హాయ్ నాన్నా
- విజయ్ దేవరకొండ – ఖుషి
- నవీన్ పోలిశెట్టి – మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
- ధనుష్ – సార్
ఉత్తమ నటి
- అనుష్క శెట్టి – మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
- వైష్ణవి చైతన్య – బేబీ
- శ్రీలీల – భగవంత్ కేసరి
- కీర్తి సురేష్ – దసరా
- మృణాల్ ఠాకూర్ – హాయ్ నాన్నా
ఉత్తమ విలన్
- షైన్ టామ్ చాకో – దసరా
- సముద్రఖని – సార్
- జిష్ణుసేన్ గుప్తా – టైగర్ నాగేశ్వర్ రావు
- దునియా విజయ్ – వీరసింహారెడ్డి
- ప్రకాష్ రాజ్ – వాల్తేరు వీరయ్య
ఉత్తమ సహాయ నటుడు
- దీక్షిత్ శెట్టి – దసరా
- హైపర్ ఆది – రావణాసురుడు
- బ్రహ్మానందం – రంగ మార్తాండ
- జయరామ్ – రావణాసురుడు
- రచ్చ రవి – బలగం
ఉత్తమ సహాయ నటి
- రమ్యకృష్ణ – రంగ మార్తాండ
- ఫారియా అబ్దుల్లా – రావణాసురుడు
- శ్రీయా రెడ్డి – సలార్: పార్ట్ 1- సీజ్ ఫైర్
- వరలక్ష్మి శరత్‌కుమార్ – వీరసింహారెడ్డి
- సోనియా సింగ్ – విరూపాక్ష
ఉత్తమ సంగీతం
- సంతోష్ నారాయణన్ – దసరా
- హేషామ్ అబ్దుల్ వహాబ్ – హాయ్ నాన్నా
- హేషామ్ అబ్దుల్ వహాబ్ – ఖుషి
- ఎస్ థమన్ – వీరసింహారెడ్డి
- దేవి శ్రీ ప్రసాద్ – వాల్తేర్ వీరయ్య
ఉత్తమ నేపథ్య గాయకుడు
- లియోన్ జేమ్స్ – (దాదాపు పడిపోయిందే పిల్ల – దాస్ కా ధమ్కీ)
- రామ్ మిరియాల – (చమ్కీలా అంగీలేసి – దసరా)
- హేషామ్ అబ్దుల్ వహాబ్ – (నా రోజా నువ్వే – ఖుషి)
- సిద్ శ్రీరామ్ – (ఆరాధ్య – ఖుషి)
- రాహుల్ సిప్లిగంజ్ – (అయ్యయ్యో – మేమ్ ఫేమస్)
ఉత్తమ నేపథ్య గాయని
- మంగ్లీ – (ఊరు పల్లెటూరు – బలగం)
- ధీ (ధీక్షిత వెంకదేశన్) – (చమ్కీలా అంగీలేసి – దసరా)
- శృతి హాసన్ – (ఒడియమ్మ – హాయ్ నాన్నా)
- చిన్మయి శ్రీపాద – (ఆరాధ్య – ఖుషి)
- రమ్య బెహరా – (మాస్ మొగుడు – వీరసింహారెడ్డి)
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























