జనక అయితే గనక నుండి నా ఫేవరెట్ నా పెళ్ళాం సాంగ్ రిలీజ్

Naa Favourite Naa Pellam full song out from Janaka Aithe Ganaka movie

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. హీరోగా ఏదో ఒక సినిమా కాకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఈఏడాది ఇప్పటికే అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. సందీప్ రెడ్డి బండ్ల‌ దర్శకత్వంలో జనక అయితే గనక అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. టైటిల్ తోనే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ మంచి రెస్పాన్స్ న సొంతం చేసుకుంది. ఇప్పుడు పాటలను రిలీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి నా ఫేవరెట్ నా పెళ్ళాం సాంగ్ రిలీజ్ చేశారు. నిన్న ఈపాట ప్రోమోను రిలీజ్ చేయగా.. తాజాగా ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు.

కాగా ఈసినిమాలో సంకీర్త‌న విపిన్‌ హీరోయిన్ గా నటిస్తుండగా.. రాజేంద్ర ప్ర‌సాద్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, గోప‌రాజు, ర‌ఘుబాబు, పృథ్వీ, శివ‌న్నారాయ‌ణ‌, రూప‌ల‌క్ష్మి, విజ‌య‌లక్ష్మి త‌దిత‌రులు నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ పై వస్తున్న ఈసినిమాను హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత‌ నిర్మిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫీ: సాయిశ్రీరామ్‌, సంగీతం: విజ‌య్ బుల్గానిన్‌ అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.