ప్రభాస్ -హను రాఘవపూడి మూవీ లాంచ్ 

Prabhas and Hanu movie begins with an auspicious pooja ceremony

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మిగితా స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే స్ట్రగుల్ అవుతుంటే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాడు.ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు.గత ఏడాది ఆది పురుష్,సలార్ తో థియేటర్లలోకి వచ్చాడు.ఇక ఈఏడాది కల్కి 2898 ఏడి రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఈసినిమా ఇంకా థియేటర్లలో ఆడుతుంది.

ఇక ఇప్పుడు ప్రభాస్  నెక్స్ట్ సినిమాను కూడా లాంచ్ అయ్యింది.సీతారామం ఫేమ్ హను రాఘవపూడి తో ప్రభాస్ సినిమా చేయనున్నాడని రీసెంట్ గా వార్తలు వచ్చాయి.ఇక ఆ న్యూస్ ను నిజం చేస్తూ ఈరోజు అఫీషియల్ గా లాంచ్ కూడా అయ్యింది.1940 బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ ఫిక్షన్ గా తెరకెక్కనుంది.ఈసందర్బంగా మూవీ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.ఈపోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.ఇందులో ఇమాన్వి హీరోయిన్ గా నటించనుండగా మిథున్ చక్రవర్తి,జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు.మైత్రి మూవీ మేకర్స్,టీ సిరీస్ నిర్మిస్తున్నాయి.విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నాడు.త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.  

ఇదిలావుండగా ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ చేస్తున్నాడు.మారుతి డైరెక్ట్ చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదలకానుంది.ఈసినిమా పూర్తి చేసిన తరువాత హనుతో సినిమా మొదలుపెట్టనున్నాడు.ఇక ఇవేకాకుండా ప్రభాస్ నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ ,ప్రశాంత్ నీల్ తో  సలార్ 2 ,నాగ్ అశ్విన్ తో కల్కి 2 చేయాల్సివుంది. 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.