2024 నేషనల్ అవార్డ్స్- బెస్ట్ తెలుగు చిత్రం కార్తికేయ2

Karthikeya 2 Movie Wins National Award,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Nikhil Siddhartha,Nikhil Siddhartha Movies,Nikhil Siddhartha New Movie,Nikhil Siddhartha Latest Movie,Nikhil Siddhartha Karthikeya 2 Movie,Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Movie Latest News,Karthikeya 2 Full Movie,Karthikeya 2 Telugu Full Movie,Karthikeya 2 Movie Award,Karthikeya 2 Bags A National Award,Chandoo Mondeti,Karthikeya 2 Wins National Award For Best Telugu Film,Anupam Kher,Anupama Parameswaran,Harsha Chemudu,Srinivas Reddy,National Award For Karthikeya 2 Movie,70th National Film Awards,Karthikeya 2 Wins The Best Telugu Film,Karthikeya 2 Bags National Film Award,Karthikeya 2 Wins Best Film In 70th National Film Awards,Karthikeya 2 Movie National Award

ప్రతి ఏడాది నేషనల్ అవార్డ్స్ ను ప్రకటిస్తారన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ ఏడాది కూడా 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో నిర్మించిన సినిమాలను పరిగణలోకి తీసుకొని దాదాపు 11మంది జ్యూరీ సభ్యులు సినిమాలను పరిశీలించి అవార్డులను ప్రకటిస్తారు. ఈమేరకు డిసెంబర్ 31 2022 నాటికి సెన్సార్ అయిన చిత్రాల‌కు అవార్డుల‌ను అందిస్తుంది. దీనిలో భాగంగానే తాజాగా 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాను ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో తెలుగు సినిమాల్లో కేవలం ఒక్క సినిమాకు మాత్రమే ఈ అవార్డ్ దక్కింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కేట‌గిరిలో బలగంతో పాటు ‘కార్తికేయ 2’, ‘మేజర్’, ‘సీతారామం’ పోటీలో నిల‌వ‌గా.. కార్తికేయ2 ఈ అవార్డును గెలుచుకుంది. ఇక ఉత్తమ హిందీ చిత్రంగా ‘గుల్‌మోహర్’, ఉత్తమ కన్నడ చిత్రంగా ‘కేజీఎఫ్2’, ఉత్తమ తమిళ సినిమా ‘పొన్నియన్ సెల్వన్-1’ అవార్డులు గెలుచుకుంది.

చందూ మొండేటి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ నటించిన సినిమా కార్తికేయ2. ఈసినిమా కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సంగతి కూడా విదితమే కదా. ఈసినిమా 2022 లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా తెలుగుతో పాటు నార్త్ లో కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ ను కూడా సాధించింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా ఈసినిమా కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా.. అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ పతాకాల పై సంయుక్తం గా నిర్మించిన ఈసినిమాకు కాల భైరవ సంగీతం అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.