కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. అక్కడ భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఘటనలో మృతుల సంఖ్య 250కిపైగా చేరినట్టు తెలుస్తుంది. అంతేకాదు కొండచరియల క్రింద ఇంకా చాలా మృతదేహాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరోవాపు ఆర్మీ, వైమానిక దళం, నేవీ, ఎన్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక దళం, స్థానికులకు చెందిన రెస్క్యూ టీమ్‌లు ఇప్పటికే సహాయక చర్యలు అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ఘటనలో నష్టపోయిన బాధితులకు సినీ సెలబ్రిటీలు సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే తమిళ్ స్టార్ హీరో విక్రమ్ 20 లక్షల విరాళాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. ఇప్పుడు మరో స్టార్ దంపతులు కూడా భారీ విరాళాన్ని అందించారు. స్టార్ యాక్టర్ సూర్య-జ్యోతిక దంపతులు రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు.
కాగా సూర్య నుండి త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా కంగువ. టాలెంటెడ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో బాబీ డియోల్, దిశా పటానీ, నటరాజన్ సుబ్రమణియం, జగపతి బాబు, యోగిబాబు, రెడిన్ కింగ్‍స్లే కీలకపాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఎన్నో రోజుల నుండి వెయిట్ చేసిన రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించారు. అక్టోబర్ 10వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























