తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ నుండి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ మాత్రమే కాదు తమిళ్ ఆడియన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. దానికి కారణం తను చేసే సినిమాల్లో కంటెంట్ ఉంటుందనే అభిప్రాయం ఉండటం వల్లే. బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా కాస్త సినిమా చూసే విధంగా ఉంటుందన్న నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని ధనుష్ కూడా ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. రీసెంట్ గా రాయన్ తో ఆ విషయం మరోసారి రుజవైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 26వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. అంతేకాదు ధనుష్ నటనకు అలానే ఆయన దర్శకత్వానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక కలెక్షన్స్ పరంగా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 75.42కోట్లను రాబట్టుకున్న ఈసినిమా 5 రోజుల్లో 87 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ లెక్కన ఈ వీకెండ్ ముగిసే సరికి 100 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.
కాగా ఈసినిమాలో ఇంకా ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, అపర్ణా బాలమురళి, ధుషార విజయన్ కీలక పాత్రల్లో నటించారు. తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఓం ప్రకాశ్ డీవోపీగా.. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అలానే యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పీటర్ హెయిన్ వ్యవహరించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























