శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా విశ్వం. మాస్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిన్నగా మొదలు పెడుతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజైన వీడియో గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి జర్నీ ఆఫ్ విశ్వం పేరుతో వీడియోను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. ఇక చెప్పినట్టే తాజాగా ఆ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇక వీడియో యాక్షన్ ప్యాక్డ్ గా కనిపిస్తుంది. వీడియోలో షూటింగ్‌కు సంబంధించిన సీన్స్‌తో పాటు సినిమాలోని యాక్షన్ సీన్స్‌ని చూపించారు. అంతేకాదు శ్రీన వైట్ల మార్క్ కామెడీ కూడా ఇందులో కనిపిస్తుంది. మొత్తానికి అటు యాక్షన్ ఇటు కామెడీ ఎలిమెంట్స్ వచ్చిన జర్నీ ఆఫ్ విశ్వం సినిమాపై అంచనాలను పెంచేసింది.
కాగా ఈసినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనువైట్ల ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేసిన గోపీ మోహన్ ఈసినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. చైతన్య భరద్వాజ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా.. కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై వేణు దొనెపూడి ఈసినిమాను నిర్మిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































