టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నుండి రాబోతున్న మోస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ డబుల్ ఇస్మార్ట్. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉండటం కామన్ థింగే.ఇక ఈసినిమాకు ఇక్కడ మాత్రమే కాదు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. దీంతో సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా రామ్ మాస్ అవతార్ ను మరోసారి ఎంజాయ్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా డబ్బింగ్ ను రామ్ కంప్లీట్ చేసినట్టు చిత్రయూనిట్ తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. డబ్బింగ్ స్టూడియోలో ఉన్న రామ్.. రెడీనా..? మామా మాస్క్ ఉంటే నీకు దొంగోడు మాత్రమే కనబడతడు.. మాస్క్ లేకుంటే నీకు మిండెడు కనపడ్తడు.. అంటూ ఫుల్ మాస్ తో రామ్ చెప్పే డైలాగ్ ను చూపించారు.
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్ని ఇప్పటికే సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. టీజర్, వరుసగా వస్తున్న పాటలు అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ట్రైలర్ ను త్వరలో రిలీజ్ చేయనున్నారు. కాగా ఈసినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో అలీ, షయాజీ షిండే, గెటప్ శ్రీను, ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కే నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























