టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శివం భజే’. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‍గా నటిస్తోంది. వికాస్ బడిస నేపథ్య సంగీతం, శివేంద్ర విజువల్స్ అందిస్తున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్ట్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగా ఈ సినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్, పాటలు రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అలాగే ఇటీవలే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కూడా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉండటంతో ఈ చిత్రం మంచి బజ్‌నే క్రియేట్ చేసింది. వీటన్నింటి మధ్య ఈ చిత్రంపై మార్కెట్‌లో మంచి హైప్ ఏర్పడింది. ఇక తాజాగా శివం భజే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. టోటల్ రన్ టైమ్ 2 గంటల 6 నిమిషాల నిడివి కలిగివుంది.
న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న శివం భజే చిత్రంలో ఈ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ గమనించారా?
పవర్‌ఫుల్ టైటిల్
టాలీవుడ్‍లో ఇటీవలి కాలంలో భారతీయ ఇతిహాసాలు, చారిత్రక కథాంశాలతో సోషియో ఫాంటసీగా సినిమాలు రూపొందుతున్నాయి. దీనికి తగ్గట్టుగా టైటిల్స్ ఉంటున్నాయి. ఈ ఏడాది రిలీజైన ‘హనుమాన్’, ‘కల్కి 2898 AD’ చిత్రాలు ఈ కోవలోకే వస్తాయి. అయితే ఇప్పుడు ఇదే తరహాలో శివం భజే కూడా తెరకెక్కినట్టు అనిపిస్తోంది. టైటిల్ తోనే ఈ చిత్రంపై ఓ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. పరమ శివుడిని గుర్తుకు తెచ్చేలా ఉన్న శివం భజే టైటిల్ అందరినీ ఆకట్టుకుంటోంది.
కథ
సీరియల్ మర్డర్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో స్టోరీ రన్ అవనున్నట్టు తెలుస్తోంది. సోషల్ కథే అయినా డివోషనల్ టచ్ ఇచ్చినట్టు అర్ధమవుతోంది. ప్రత్యేకించి హీరో క్యారక్టరైజేషన్ ఎంతో ఇంటెన్స్‌తో కనిపిస్తోంది. హిడింబ తర్వాత అశ్విన్ బాబు మరో అద్భుతమైన కథతో వస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన క్యారక్టర్ డిఫరెంట్ షేడ్స్‌లో సాగుతున్నట్టు అనిపిస్తోంది. శివుడి భక్తుడిగా అశ్విన్ కనిపించనున్నాడు.
హీరో అశ్విన్ బాబు
ప్రముఖ యాంకర్ కం డైరెక్టర్ ఓంకార్ తమ్ముడిగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చాడు హీరో అశ్విన్ బాబు. 2012లో వచ్చిన జీనియస్‌లో తొలిసారిగా నటించాడు. ఆ తర్వాత ‘రాజు గారి గది’, ‘రాజు గారి గది 2’ చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు. గతేడాది ‘హిడింబ’ చిత్రంతో మరోసారి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు తాజాగా శివం భజేతో మరోసారి అలరించడానికి సిద్దమయ్యాడు. ఈ మూవీ ట్రైలర్‌లో తన సూపర్ ఫిజిక్‌తో అశ్విన్ బాబు హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టడం గమనించొచ్చు.
హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ
హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ.. హిప్పీ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. వలయం, సీటీమార్, క్రేజీ ఫెలో తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తాజాగా శివం భజేతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో తన బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రజెన్స్‌తో దిగంగనా ఆకట్టుకుంటోంది. ఇక పాటల్లోనూ ఎంతో ఈజ్‌తో డాన్స్ చేసింది. హీరో అశ్విన్ బాబుతో తన కెమిస్ట్రీ సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు.
ప్రొడక్షన్ వ్యాల్యూస్
గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన శివ భక్తుడు కావడం ఇక్కడ విశేషం. అయితే కేవలం అదొక్కటే కారణం కాదని, కథ నచ్చడంతోనే ఈ సినిమా చేశానని ఆయన స్పష్టం చేశారు. నిర్మాత చెప్పినట్టు శివం భజే ట్రైలర్ చూస్తుంటే లావిష్‌గా తీసినట్లుగా కనిపిస్తోంది. విజువల్స్ పరంగా హై స్టాండర్డ్స్‌తో రూపొందినట్టు తెలుస్తోంది. ఇందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వుంది. మొత్తానికి శివం భజే అన్ని వయస్సుల వారినీ అలరించనుండటం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: